చంద్రబాబుపై పరువు నష్టం దావా వేసిన సీఐపై సర్కార్ కఠిన నిర్ణయం!!
సీఎం నారా చంద్రబాబు నాయుడు తన పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకే నోటీసులు పంపిన పులివెందుల మాజీ సీఐపై సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా చర్య కింద సర్వీసు నుంచి తొలగిస్తూ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు సీఐ శంకరయ్య డిస్మిస్ చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
సజ్జనార్ గారు మీరు సూపర్ : పవన్ కళ్యాణ్
పోలీసులకు సైతం సవాల్ విసిరే స్థాయికి ఎదిగిన పైరసీ ముఠాలను అదుపులో పెట్టే క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం, సీపీ సజ్జనార్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సినీ ప్రముఖులు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ క్రమంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పోలీసుల కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.
జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా! రేవంత్ సంచలన కామెంట్స్!!
నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరులో జూబ్లీహిల్స్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు.తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ.ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు.
కొండా సురేఖ క్షమాపణలు.. నాగార్జున సంచలన నిర్ణయం!
ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్తుంటాము. కానీ అధికారం వచ్చిన తర్వాత, పదవిలో ఉన్నాం కదా అని నోటికొచ్చిన మాటలు చెప్పకూడదు. “ఈశ్వరుడు నోరు ఇచ్చాడని” నోటికొచ్చినది మాట్లాడకూడదు. కాదు, నేను ఇంతే, నా రూటే, సెపరేట్ అని చెప్పినా, దాని సమయం వచ్చినప్పుడు కాలం మాట్లాడుతుంది — కాలం నిర్ణయిస్తుంది. శృతిమించనంత వరకు ఏదైనా ఇంపే.. పరిధులు దాటితే ముమ్మాటికీ కంపే.
జగన్ చెప్తాడు కానీ చేయడా?
గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత జగన్ మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలపర్చడానికి కృషి చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలతో నేరుగా మమేకమై వారి సమస్యలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలను చక్కబెడుతున్నారు. మరోవైపు ప్రజా సమస్యలపై ధర్నాలు, పోరాటాలు చేస్తూ ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు.
నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు! అర్ధరాత్రి వివరణ!!
తెలంగాణ రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున మరియు ఆయన కుటుంబంపై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడిస్తూ, నాగార్జున మరియు వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలిపారు.
ఆర్ కాంగ్రెస్ పాయె, ఐ కాంగ్రెస్ పాయె, త్వరలో వై కాంగ్రెస్ కూడా!!
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నేడు మీడియాలో మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాచమల్లు వాడో బచ్చా వాళ్లేంది నాకు బిక్ష పెట్టేది దమ్ముంటే చర్చకు రావాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తా,” అని సవాల్ విసిరారు. బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను విమర్శలు చేశారు.దేశంలో మొదటి స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్‌ను జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి వైపు ఆయన దృష్టి లేదు. ఆయన పట్టించుకోకపోతే మేమే అభివృద్ధి చేస్తున్నాం, అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయన రాజకీయ చరిత్రను ప్రస్తావన చేస్తూ1996లో వైఎస్ కుటుంబం ఓటమి భయంతో నా మద్దతు కోరింది. ఆర్ కాంగ్రెస్ పోయింది, ఐ కాంగ్రెస్ పోయింది, త్వరలో వై కాంగ్రెస్ కూడా పోతుంది,అని పేర్కొన్నారు.
అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి.. పాడె మోసి నివాళి!!
ప్రసిద్ధ కవి, రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లాలాపేట్ నుంచి ఘట్కేసర్ వరకు సాగిన అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆగిపోయిన ప్రచారాలు..మూగబోయిన మైకులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉండగా..దాదాపు 45రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచారానికి తెర పడింది.అన్ని పార్టీల నేతలందరూ చివరి నిమిషం వరకూ సర్వశక్తులను ఒడ్డి ప్రచారం చేశారు.
"ఎవరినీ వదిలిపెట్టేది లేదు" - అనంతపురం సాక్షిగా లోకేష్ శపథం!!
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ, వారిని నేరుగా కలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. అలాగే ప్రభుత్వం తరఫున భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొని కురుబలతో దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!