శబరి మౌనం వెనుక పెద్ద కథ! .. నందికొట్కూరులో అసలేం జరిగింది?
అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఆ టీడీపీ ఎంపీ తన సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో జరిగిన పోరుకు దూరంగా ఉండడం వల్లే అక్కడ కూటమి ఓడిపోయిందా? ఆమె ఆ మున్సిపాలిటీలో ఎందుకు అడుగు పెట్టలేదు? వ్యతిరేక వర్గం అడ్డుకోవడం వల్లే ఆమె వెళ్ళలేకపోయారా? టీడీపీ అధిష్టానం చేసిన పోస్టుమార్టంలో ఏం తేలింది?
ఏపీలో ఫీజుల ఫైట్.. జగన్ వర్సెస్ లోకేష్!
ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలకు దిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక తొమ్మిది వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందని వైసీపీ విమర్శిస్తోంది. అయితే గత వైసీపీ పాలనలో పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలను తాము చెల్లిస్తున్నామని టీడీపీ చెబుతోంది. మరోవైపు తమకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల సంఘం స్పష్టం చేస్తోంది.
విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు!!
చార్టర్డ్ అకౌంటెంట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన వి. విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో , ముఖ్యంగా వైసీపీలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. 1980 ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో ఏర్పడిన పరిచయం ద్వారా వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితో అనుబంధం పెరగడంతో జగన్మోహన్రెడ్డి వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు.
పవన్ కళ్యాణ్ కోసం.. ఒక్కటైన టీడీపీ, వైసీపీ!
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ పరస్పర విమర్శలు, ఆరోపణలతో వార్తల్లో నిలిచే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఒక విషయంలో మాత్రం ఒకే వైఖరిని ప్రదర్శించాయి. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రెండు పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అధికార ప్రభంజనంలోనూ వైసీపీ పట్టు..!!
కూటమి అధికార ప్రభంజనం స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా వీచినా.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. స్థానాల సంఖ్యలో కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపించినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ తన బలాన్ని గట్టిగానే చాటుకుంది. నామినేషన్ల సమయంలో ఎదురైన అడ్డంకులు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా పట్టువిడవని పోరాటంతో 11 జడ్పీటీసీ స్థానాలతో పాటు 167 ఎంపీటీసీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అధికార కూటమి వ్యూహాలను ఎదుర్కొంటూ క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకుంది.
రూ.15.8 కోట్ల లాయర్ ఫీజు.. చంద్రబాబుకు కొత్త చిక్కా?
సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 జూన్ నుంచి 2026 జూన్ మధ్య రూ.15.80 కోట్ల ఫీజులు చెల్లించిందంటూ హైకోర్టులో పిల్ దాఖలు కావడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మాజీ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు ఈ పిల్‌ను దాఖలు చేశారు. పిటిషనర్ ఆరోపణ ప్రకారం, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసుల్లో లూత్రా వాదనలు వినిపించగా, టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో ప్రభుత్వ కేసుల కోసం ఆయన సేవలను వినియోగించారు. అయితే ఇవి ప్రస్తుతం పిల్లో చేసిన ఆరోపణలు మాత్రమే; కోర్టు వాటిపై ఇంకా తుది నిర్ణయం ఇవ్వలేదు.
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
జగన్ తాజా హెచ్చరికలో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలు మరియు అప్పట్లో ఏకగ్రీవాలపై వచ్చిన విమర్శలు ఇప్పుడు మళ్లీ చర్చకు రావడం సహజం. అధికారంలో ఉన్నప్పుడు ఒక పరిస్థితి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో పరిస్థితి అన్న విమర్శను జగన్ ఎలా ఎదుర్కొంటారన్నది కూడా కీలకమే. అయితే ప్రస్తుతానికి వైసీపీ లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. స్థానిక సంస్థల ఎన్నికలను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ పునర్నిర్మాణానికి, కేడర్‌లో పోరాట స్ఫూర్తి పెంచడానికి ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడం. ఈ నేపథ్యంలో జగన్ హెచ్చరిక కేవలం ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్య మాత్రమే కాకుండా, నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుకు పెట్టిన రాజకీయ పరీక్షగా కూడా చూడవచ్చు. గత అనుభవాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య ఈ వ్యూహం వైసీపీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.
ఏకగ్రీవాలపై జగన్ వార్నింగ్.. గతాన్ని మరిచారా?
ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఇచ్చిన హెచ్చరిక రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏ నియోజకవర్గంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం జరిగితే, అక్కడి ఇన్ఛార్జీలు లేదా ఎమ్మెల్యేసీటు ఆశిస్తున్న నేతలు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని జగన్ స్పష్టమైన హెచ్చరిక చేశారు. ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థిని బరిలో నిలబెట్టాలని, కేడర్ కోసం నాయకులు గట్టిగా పోరాడాలని ఆయన సూచించారు. స్థానిక ఎన్నికలు కేవలం గెలుపోటముల కోసం కాదని, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే పరీక్షగా చూడాలని నాయకులకు జగన్ హితబోధ చేశారు.
Kadapa Political Heat : కడప రాజకీయం కత్తులు దూస్తుంది..!
కడప రాజకీయం కత్తులు దూస్తుంది ఊర మాస్ వార్నింగ్ లతో మంటలు పుట్టిస్తుంది. ఒక వైపు అన్నాదమ్ములు, మరోవైపు భార్య భర్తలు మీ ఇంటికి వస్తా మీ నట్టింటికి వస్తా మాతో పెట్టుకోవద్దు అంటూ వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తే లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం అంటూ ప్రతి సవాలు చేస్తున్నారు టీడీపీ నేతలు.
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!