అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
జగన్ తాజా హెచ్చరికలో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలు మరియు అప్పట్లో ఏకగ్రీవాలపై వచ్చిన విమర్శలు ఇప్పుడు మళ్లీ చర్చకు రావడం సహజం. అధికారంలో ఉన్నప్పుడు ఒక పరిస్థితి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో పరిస్థితి అన్న విమర్శను జగన్ ఎలా ఎదుర్కొంటారన్నది కూడా కీలకమే. అయితే ప్రస్తుతానికి వైసీపీ లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. స్థానిక సంస్థల ఎన్నికలను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ పునర్నిర్మాణానికి, కేడర్‌లో పోరాట స్ఫూర్తి పెంచడానికి ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడం. ఈ నేపథ్యంలో జగన్ హెచ్చరిక కేవలం ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్య మాత్రమే కాకుండా, నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుకు పెట్టిన రాజకీయ పరీక్షగా కూడా చూడవచ్చు. గత అనుభవాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య ఈ వ్యూహం వైసీపీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.
ఏకగ్రీవాలపై జగన్ వార్నింగ్.. గతాన్ని మరిచారా?
ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఇచ్చిన హెచ్చరిక రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏ నియోజకవర్గంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం జరిగితే, అక్కడి ఇన్ఛార్జీలు లేదా ఎమ్మెల్యేసీటు ఆశిస్తున్న నేతలు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని జగన్ స్పష్టమైన హెచ్చరిక చేశారు. ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థిని బరిలో నిలబెట్టాలని, కేడర్ కోసం నాయకులు గట్టిగా పోరాడాలని ఆయన సూచించారు. స్థానిక ఎన్నికలు కేవలం గెలుపోటముల కోసం కాదని, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే పరీక్షగా చూడాలని నాయకులకు జగన్ హితబోధ చేశారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!