వామ్మో 7వ వార్డు .. అక్కడ గెలిస్తే చావేనా?
ఎన్నికల్లో గెలవాలంటే ఎన్నో వ్యూహాలు ఉండాలి. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలంటే ఆషామాషీ కాదు. సొంత పార్టీ వాళ్ళనే కలుపుకుంటూ గెలవడానికి బాటలు వేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ ఫార్ములా రాష్ట్రమంతా చెల్లుతుందేమో కానీ ఆ వార్డులో మాత్రం కాదు. అక్కడ గెలవాలంటే ముందు పోటీ చేయాలి. పోటీ చేస్తే ప్రాణాలు పోతాయని తెలిస్తే ఎవరైనా నిలబడతారా? ఇంతకీ అంతలా భయపెడుతున్న వార్డు ఎక్కడుంది? అక్కడ అభ్యర్థులు ముందుకు రాకపోవడానికి కారణాలేంటి?
ఏపీలో ఫీజుల ఫైట్.. జగన్ వర్సెస్ లోకేష్!
ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలకు దిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక తొమ్మిది వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందని వైసీపీ విమర్శిస్తోంది. అయితే గత వైసీపీ పాలనలో పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలను తాము చెల్లిస్తున్నామని టీడీపీ చెబుతోంది. మరోవైపు తమకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల సంఘం స్పష్టం చేస్తోంది.
విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు!!
చార్టర్డ్ అకౌంటెంట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన వి. విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో , ముఖ్యంగా వైసీపీలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. 1980 ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో ఏర్పడిన పరిచయం ద్వారా వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితో అనుబంధం పెరగడంతో జగన్మోహన్రెడ్డి వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు.
పవన్ కళ్యాణ్ కోసం.. ఒక్కటైన టీడీపీ, వైసీపీ!
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ పరస్పర విమర్శలు, ఆరోపణలతో వార్తల్లో నిలిచే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఒక విషయంలో మాత్రం ఒకే వైఖరిని ప్రదర్శించాయి. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రెండు పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
రూ.15.8 కోట్ల లాయర్ ఫీజు.. చంద్రబాబుకు కొత్త చిక్కా?
సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 జూన్ నుంచి 2026 జూన్ మధ్య రూ.15.80 కోట్ల ఫీజులు చెల్లించిందంటూ హైకోర్టులో పిల్ దాఖలు కావడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మాజీ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు ఈ పిల్‌ను దాఖలు చేశారు. పిటిషనర్ ఆరోపణ ప్రకారం, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసుల్లో లూత్రా వాదనలు వినిపించగా, టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో ప్రభుత్వ కేసుల కోసం ఆయన సేవలను వినియోగించారు. అయితే ఇవి ప్రస్తుతం పిల్లో చేసిన ఆరోపణలు మాత్రమే; కోర్టు వాటిపై ఇంకా తుది నిర్ణయం ఇవ్వలేదు.
అధికారులకు పవన్ కల్యాణ్ వార్నింగ్..!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా అన్నదాతలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోనసీమ రైతుల గళామవుతా..గొంతువవుతా, వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే ఇక్కడకు వచ్చానని.. ఓట్ల కోసం మాత్రం కానే కాదని భరోసా ఇచ్చారు.
సజ్జనార్ గారు మీరు సూపర్ : పవన్ కళ్యాణ్
పోలీసులకు సైతం సవాల్ విసిరే స్థాయికి ఎదిగిన పైరసీ ముఠాలను అదుపులో పెట్టే క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం, సీపీ సజ్జనార్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సినీ ప్రముఖులు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ క్రమంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పోలీసుల కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.
"ఎవరినీ వదిలిపెట్టేది లేదు" - అనంతపురం సాక్షిగా లోకేష్ శపథం!!
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ, వారిని నేరుగా కలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. అలాగే ప్రభుత్వం తరఫున భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొని కురుబలతో దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
కుప్పంలో పలు పరిశ్రమలకు వర్చువల్‌గా శంకుస్థాపన!
AP CM Chandrababu Naidu Live
వాట్ యాన్ ఐడియా సర్ జీ : సీఎంని మించిపోయిన డిప్యూటీ సీఎం!!
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్( Pawan Kalyan) పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలతో పాటు అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిసిందే. స్వతహాగా పర్యావరణ ప్రియుడు అయిన పవన్, అడవుల సంరక్షణకు వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తున్నారు. అదే సమయంలో, అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రత, సంక్షేమం ఆయనకు ముఖ్యమని చెప్పవచ్చు. ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గజరాజుల సమస్య కొన్ని సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తోంది. సమీప అడవుల నుంచి గ్రామాల్లోకి వచ్చే ఏనుగులు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే కాక, వందల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తుంటాయి.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!